File
FILEఅయితే వైఎస్.జగన్ విధేయులుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల వ్యవహారశైలి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ముఖ్యంగా పార్టీలోనే ఉంటూ జగన్‌కు పూర్తి సహాయసహకారాలను అందిస్తామని ప్రకటించారు. పైపెచ్చు.. అవకాశం దొరికినప్పుడల్లా పార్టీని సూటిబోటి మాటలతో కుళ్లబొడవటమే పనిగా పెట్టుకుంటున్నారు.
సోమవారం రాత్రి కృష్ణా జిల్లా బందరులో జరిగిన బహిరంగ సభలో స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే పేర్ని నాని వ్యవహారశైలే ఇందుకు ఓ మచ్చుతునకగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో మనసు చంపుకుని ఉంటున్నాననీ, వైఎస్ ఇచ్చిన టిక్కెట్టుపై గెలిచినందుకు 2014 వరకూ కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ప్రకటించారు. అదేసమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వాన్ని కూలదోసే పనికి పూనుకోమని తేల్చి చెప్పారు. అదేసమయంలో జగన్‌కు పూర్తిస్థాయిలో తమ మద్దతు ఉంటుందని తెగేసి చెప్పారు.
ఆయన బయటపడి చెప్పారు. కానీ వైఎస్సార్ విధేయులుగా పేరున్న చాలామంది శాసనసభ్యులు ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలోనే ఉంటూ సందర్భం వచ్చినపుడల్లా కుళ్లబొడుస్తూ 2014 నాటికి తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనే దిశగా జగన్ వర్గం పావులు కదుపుతోంది.
ఇప్పటికే ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడంలో ప్రధానప్రతిపక్షం కంటే జగన్ వర్గం సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇదే ఊపును మున్ముందు కూడా కొనసాగించి 2014 నాటికి కాంగ్రెస్ పార్టీని నామరూపాల్లేకుండా చేయాలన్నదే వారి వ్యూహంగా కనబడుతోంది. నిమిషానికోరకంగా మారే నేటి నేటి రాజకీయాల్లో 2014 నాటికి ఎలాంటి మలుపులు తిరిగి ఎక్కడ ఆగుతాయో చూడా
No comments:
Post a Comment