Sponsered By:

Friday, December 31, 2010

*****Happy New Year*****
***2011***
##May this new year Blossom Happiness on you## 

Happy New Year 2011

హ్యాపీ న్యూ ఇయర్ !
 ౨౦౧౧ 
కొత్త సంవస్త్సర శుభాకాంక్షలు 
-పవన్ కుమార్ యాదవ్ (0739612624)

Thursday, December 30, 2010

అంజి వెడ్స్ హేమలత

అంజి వెడ్స్ హేమలత 
ఈ రోజు 30 /12 /2010 ఉదయం 8 :30 నుంచి 9 :00 వరకు అంజి పెళ్లి జరిగినది 
మనమందరం వారిని దీవిదాం 
హ్యాపీ మర్రిఎద్ లైఫ్! 
(Happy married Life ! )
-పవన్ కుమార్ యాదవ్ 

Friday, December 24, 2010

వాళ్లిద్దరి మధ్య నిజంగా కెమిస్ట్రీ నడుస్తుందా...?!! (Rana | Actress Sherya saran)

WD
స్టార్ ప్రొడ్యూసర్ మనవడు రానా, సెక్సీ సుందరి శ్రియ మధ్య గత కొంతకాలంగా కెమిస్ట్రీ నడుస్తోందని ఫిలిమ్ నగర్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఇటీవల వీళ్లద్దరూ తరచూ కలుసుకుంటున్నారట. 

ఈ గుసగుసల సంగతి ఎలా ఉన్నా మొన్నీమధ్య హైదరాబాదులో జరిగిన ప్యాంటలూన్ ఫెమినా మిస్ సౌత్ ఇండియా 2011 ఫంక్షన్ కి రానా, శ్రియ హాజరయ్యారు. 

ఫంక్షన్ ఆద్యంతం ఇద్దరూ ఒకరికొకరు కలిసి చాలా సరదాగా మాట్లాడుతూ గడిపారు. దీనిపై శ్రియ సన్నిహితులను కదిలిస్తే... అలా ఏదో కలిసి మాట్లాడుకున్నంత మాత్రాన కెమిస్ట్రీ ఉన్నట్లేనా...? అని ఎదురు ప్రశ్నలు 

Tuesday, December 14, 2010

ప్రభుత్వాన్ని కూల్చం... కానీ కుళ్లబొడుస్తాం... జగన్ విధేయులు!! (YSJagan, YSR, Congress, 2014 Election, Regional, KKR)

File
FILE
రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకీ హీనాతిహీనంగా దిగజారిపోతోంది. విపక్షాలకంటే స్వపక్ష సభ్యులే ఆ పార్టీని మాటలతో కుళ్ళబొడుస్తున్నారు. దివంగత నేత వైఎస్సార్ తనయుడు వైఎస్.జగన్ పార్టీ అధిష్టానంతో విభేదించి బయటకు వెళ్లిపోయారు. పోతూ పోతూ... తనకు 151 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పుడే ప్రభుత్వాన్ని కూలగొట్టలేదనీ, ప్రస్తుతం తనకు ఉన్న సభ్యులతో కూడా ఆ పని చేయబోనని ప్రకటించారు. 

అయితే వైఎస్.జగన్ విధేయులుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల వ్యవహారశైలి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ముఖ్యంగా పార్టీలోనే ఉంటూ జగన్‌కు పూర్తి సహాయసహకారాలను అందిస్తామని ప్రకటించారు. పైపెచ్చు.. అవకాశం దొరికినప్పుడల్లా పార్టీని సూటిబోటి మాటలతో కుళ్లబొడవటమే పనిగా పెట్టుకుంటున్నారు. 

సోమవారం రాత్రి కృష్ణా జిల్లా బందరులో జరిగిన బహిరంగ సభలో స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే పేర్ని నాని వ్యవహారశైలే ఇందుకు ఓ మచ్చుతునకగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో మనసు చంపుకుని ఉంటున్నాననీ, వైఎస్ ఇచ్చిన టిక్కెట్టుపై గెలిచినందుకు 2014 వరకూ కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ప్రకటించారు. అదేసమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వాన్ని కూలదోసే పనికి పూనుకోమని తేల్చి చెప్పారు. అదేసమయంలో జగన్‌కు పూర్తిస్థాయిలో తమ మద్దతు ఉంటుందని తెగేసి చెప్పారు.

ఆయన బయటపడి చెప్పారు. కానీ వైఎస్సార్ విధేయులుగా పేరున్న చాలామంది శాసనసభ్యులు ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలోనే ఉంటూ సందర్భం వచ్చినపుడల్లా కుళ్లబొడుస్తూ 2014 నాటికి తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనే దిశగా జగన్ వర్గం పావులు కదుపుతోంది. 

ఇప్పటికే ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడంలో ప్రధానప్రతిపక్షం కంటే జగన్ వర్గం సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇదే ఊపును మున్ముందు కూడా కొనసాగించి 2014 నాటికి కాంగ్రెస్ పార్టీని నామరూపాల్లేకుండా చేయాలన్నదే వారి వ్యూహంగా కనబడుతోంది. నిమిషానికోరకంగా మారే నేటి నేటి రాజకీయాల్లో 2014 నాటికి ఎలాంటి మలుపులు తిరిగి ఎక్కడ ఆగుతాయో చూడా

Monday, December 13, 2010

కృష్ణా జిల్లా రాజకీయాల్లో జగన్మోహనాస్త్రం: నేతల్లో కలకలం!!! (Krishna Dist | Jagan | KKR | Perni Naani | Political news | Lagadapati)

కృష్ణా జిల్లా రాజకీయాల్లో కలకలం మొదలైంది. ఈ జిల్లాలో వర్షబాధిత రైతులను పరామర్శించేందుకు కడప మాజీ ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పర్యటనతో జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. జగన్‌తో బందరు ఎమ్మెల్యే పేర్ని నాని సమావేశమై మంతనాలు జరిపారు. తాను జగన్ వెంట వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత తన అనుచరులతో ఆయన భేటీ అయ్యారు. దీంతో కృష్ణా జిల్లా రాజకీయాలు ఒక్కరోజులోనే వేడెక్కిపోయాయి. 

మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఎఫెక్టు ఆయన సొంత జిల్లా కడపలో కన్నా వేరే జిల్లాలోనే కనిపిస్తోంది. కృష్ణా జిల్లాలో దాదాపు కాంగ్రెస్ మొత్తం జగన్ వెంబడి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ రోజు ఉదయం బందరు శాసనసభ్యుడు పేర్ని నాని మొదట బాంబు పేల్చాడు. తాను జగన్ వెంట వెళ్లేందుకు సిద్ధమవుతున్నానని చెప్పాడు. తన అనుచరులతో భేటీ అయ్యానని వారంతా జగన్‌తో వెళ్లేందుకు తనపై ఒత్తిడి తీసుకు వస్తున్నారని చెప్పారు. తన అనుచరవర్గం చెప్పినట్టు నడుచుకోవాలని తాను నిర్ణయించుకున్నట్టు చెప్పారు. 

పేర్ని నానిని ఆదర్శంగా తీసుకున్న మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా జగన్ వెంట నడిచేందుకు సిద్ధమయ్యారు. వీరితో పాటు.. జగ్గయ్యపేట, నూజివీడు, మైలవరం, విజయవాడ పశ్చిమం మాజీ శాసనసభ్యులు ఉదయభాను, తాటి వెంకట ప్రతాప్ అప్పారావు, జ్యేష్ట రమేష్, జలీల్ ఖాన్, విజయవాడ మాజీ మేయర్ తాటి శకుంతల తదితరులు ఉన్నారు. 

అంతేకాకుండా, మాజీ మున్సిపల్ ఛైర్మన్లు, జెడ్పీటీసీ సభ్యుడు నాగేశ్వరరావుపై కూడా జగన్మోహనాస్త్రం పని చేసింది. గతంలో పెడన శాసనసభ్యుడు జోగి రమేష్ ఒక్కడే జగన్ వెంట వెళతారని ఇప్పటి వరకు అందరూ భావించారు. అయితే, ఆయన వెనక్కి తగ్గగా, అనూహ్యంగా కొత్త ఎమ్మెల్యేలు ముందుకు రావడం గమనార్హం. 

వాస్తవానికి పేర్ని నాని శనివారం సాయంత్రం వరకు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తగా మంచిపేరుంది. అయితే, కృష్ణా జిల్లాలో జగన్ అడుగుపెట్టగానే.. జగన్ వెంట వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రాత్రికి రాత్రి చోటుచేసుకున్న హఠాత్పరిణామంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్టించాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేకేఆర్ తక్షణం జిల్లాలోని సీనియర్ నేతలైన లగడపాటి రాజగోపాల్, ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణులకు ఫోన్ చేసి తాజా పరిస్థితులపై చర్చించారు. 

అంతేకాకుండా పేర్ని నానితో కూడా కాంగ్రెస్ పెద్దలు మాట్లాడినప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. జగన్ వైపే మొగ్గు చూపుతానని తేల్చిచెప్పారు. తాను జగన్ వెంట వెళ్లడానికి పదవులనో డబ్బులనో ఆశించి వెళ్లడం లేదని చెప్పారు. తన అభిమానులు, కార్యకర్తల కోరిక మేరకే వెళుతున్నట్టు తెలిపారు. అయితే, మంత్రి పదవి ఇవ్వనందుకే నాని జగన్ వెంట వెళ్లడానికి సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రకటనలో కృష్ణా రాజకీయాలు ఒక్కసారి మారిపోయా

జిల్లాల వారీగా వైఎస్.జగన్మోహన్ "ఆకర్ష్ పథకం" అమలు!!! (YS Jaganmohan | Krishna dist | Akarsh | Congress | Regional)

File
FILE
కడప మాజీ ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి "ఆకర్ష్ పథకాన్ని" జిల్లాల వారీగా అత్యంత రహస్యంగా అమలు చేస్తున్నారు. రైతుల పరామర్శ పేరుతో కృష్ణా జిల్లాలో జగన్ చేపట్టిన తొలి పర్యటనే కాంగ్రెస్‌లో కలకలం రేపింది. స్వయంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని జగన్ మాయలో పడిన నేతలు బుజ్జగించాల్సి వచ్చింది. ముఖ్యంగా, జగన్‌ ప్రభావం ఉండదని భావించిన నేతలు తమ అభిప్రాయాన్ని మార్చుకోక తప్పలేదు. దీంతో కాంగ్రెస్ పెద్దలు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు జగన్ అనుచరులుగా ముద్రపడిన వారికి ఏదో ఒకటి ఎర వేస్తూ బుజ్జగిస్తూ వచ్చారు. అయితే వీరు కాకుండా కొత్త ఎమ్మెల్యేలు, నేతలు జగన్ ట్రాప్‌లో పడటంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. 

తన తండ్రి ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం తనకు లేదని పదేపదే చెపుతున్నప్పటికీ.. ఆయన మాటలు... చేష్టలు.. వ్యవహారశైలి మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. 2011లో జరిగేవి సెమీ ఫైనల్స్‌గానూ, 2014 ఫైనల్స్‌ జరిగే ఎన్నికలు ఫైనల్స్‌గా పోల్చిన జగన్.. ఈ ముందుగానే తాను నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునే దిశగా పావులు కదుపుతున్నట్టు సమాచారం. 

ఇందుకోసం జగన్‌కు కుడిభుజంలా వ్యవహరిస్తున్న బంధువు వైవీ.సుబ్బారెడ్డి, తితిదే మాజీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి, తుడా మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అమలాపురం ఎంపీ సబ్బం హరి, నెల్లూరు ఎంపీ మేకపాటి రామోహన్ రెడ్డి, అంబటి రాంబాబులు ఇలా ఒక్కో జిల్లాలో ఒకరు లేదా ఇద్దరు కీలక నాయకులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. 

వీరంతా ఇటు కాంగ్రెస్‌తో పాటు.. అటు ప్రజారాజ్యం, తెలుగుదేశం పార్టీల నాయకులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. తన వైపు రావడానికి సుముఖత వ్యక్తం చేస్తున్న నేతలతో జగన్ స్వయంగా ఫోనులో మంతనాలు జరుపుతున్నారు. అందువల్లే కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. 

ఇదేవిధంగా హైదరాబాద్‌లో దివంగత నేత పి.జనార్ధన్ రెడ్డి కుమారుడు, శాసనసభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డితో జగన్ అనుచరులు నిరంతరం టచ్‌లో ఉంటున్నారు. తన పట్ల పార్టీ అనుసరిస్తున్న వైఖరి, పార్టీ నేతలెవ్వరూ తనను పట్టించుకోక పోవడంతో తీవ్ర అసంతృప్తికిలోనై గుర్రుగా ఉన్న ఈ యువనేత జగన్ వైపుకు మొగ్గు చూపే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. 

ఇకపోతే.. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ సొంత జిల్లా చిత్తూరులో ఆపరేషన్ ఆకర్ష్ పథకాన్ని మరింత పక్బంధీగా అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ బాధ్యతను కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు స్వీకరించగా, మంత్రి పదవి దక్కని సీనియర్ నేతలు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కుతూహలమ్మలు తమ వంతు సహకారం అందిస్తున్నట్టు సమాచారం. 

అలాగే, విశాఖపట్నం జిల్లాలో ఎంపీ సబ్బం హరి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వైవీ.సుబ్బారెడ్డి సమావేశమై జగన్ ఓదార్పు యాత్ర షెడ్యూల్‌ను ఖరారు చేయడం గమనార్హం. ఇలా జిల్లాల వారీగా వైఎస్ జగన్ ఆకర్ష్ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఏది ఏమైనా.. జగన్ మాత్రం కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తూ ముఖ్యమంత్రితో పాటు అధిష్టానానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. 

ప్రజాకర్షణ, స్థానికంగా పట్టున్న నేతలను జగన్ తన వైపుకు తిప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. పైపెచ్చు.. రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకుని.. తాము అమలు చేస్తున్న వ్యూహంలో ఎక్కడా తప్పుదొర్లకుండా అత్యంత జాగ్రత్త వహిస్తూ జగన్ వర్గం ముందుకు పోతోంది. అయితే ఈ పరిస్థితిని వారించేందుకు కాంగ్రెస్ నేతల్లో ఏ ఒక్కరూ చొరవ తీసుకోక పోవడం గమనార్హం.

బాధపడొద్దు బాబాయ్... ఇదిగో నా పారితోషికం... (Ramcharan | Orange | Nagababu)

WD
ఆరెంజ్ సూపర్ ప్లాప్‌తో నిర్మాత నాగబాబు తీవ్రమైన అసంతృప్తికి లోనయ్యాడు. మొన్నీమధ్య మిరపకాయ్ ఆడియో ఫంక్షన్లో ఆరెంజ్ దర్శకునిపై పరోక్షంగా విరుచుకపడ్డాడు. కోట్ల రూపాయలు పెట్టి నిర్మాత సినిమా తీస్తుంటే, దాన్ని సీరియస్‌గా తీసుకోని కొందరు దర్శకులు నిర్మాతలను పురుగుల్లా పీల్చి పిప్పి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

బాబాయ్ ఆవేదనను అబ్బాయ్ అర్థం చేసుకున్నాడో ఏమోగానీ, రాంచరణ్ ఆరెంజ్ సినిమాకోసం తీసుకున్న పారితోషికాన్ని వెనక్కి తిరిగి ఇచ్చేశాడట. బాధపడకు బాబాయ్... నిర్మాత దెబ్బతిన్నప్పుడు నటీనటులు తప్పక ఆదుకోవాలని తన మాటగా చెప్పాడట. 

Friday, December 10, 2010

జట్టును గెలిపించడమే నా లక్ష్యం: వీవీఎస్ లక్ష్మణ్

FILE
తన కంటూ ప్రత్యేకించి లక్ష్యాలంటూ లేవని, జట్టును గెలిపించడమే తన ప్రధాన కర్తవ్యమని ఆపద్భాంధవుడు, హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడాన్ని ఇష్టపడతానని లక్ష్మణ్ వెల్లడించాడు. దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌ను టీమ్ ఇండియా ఛాలెంజింగ్‌గా తీసుకుంటుందని వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. 

ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు పటిష్టంగా ఉంది. స్టెయిన్, మోర్కెల్‌ల ఫాస్ట్ బౌలింగ్, కల్లీస్ ఆల్‌రౌండర్‌గా రాణించడం భారత్‌కు బలపరీక్షేనని లక్ష్మణ్ చెప్పాడు. కానీ ఇటీవల కాలంలో భారత్ విదేశీ గడ్డపై అద్భుతంగా రాణిస్తోంది. ఇదే తీరు దక్షిణాఫ్రికాలోనూ కొనసాగుతుందని నమ్ముతున్నానని లక్ష్మణ్ అన్నాడు.భారత్ బౌలింగ్‌కు అనుకూలించని పిచ్‌లు ఫాస్ట్ బౌలింగ్‌కు పనికివస్తాయని లక్ష్మణ్ తెలిపాడు. తమ జట్టులో అద్భుతంగా రాణించే బౌలర్లు ఉన్నారని వీవీఎస్ గుర్తు చేశాడు. కానీ టీమ్ ఇండియాలోని ఆటగాళ్లు సూపర్ ఇన్నింగ్స్ ఆడితే తప్పకుండా దక్షిణాఫ్రికా గడ్డపై సిరీస్ నెగ్గడం సాధ్యమేనని వీవీఎస్ అఅన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 350 పరుగుల ఆధిక్యం సాధించాలని లక్ష్మణ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

హాంకాంగ్ ఓపెన్ సిరీస్: సెమీఫైనల్లో సైనా నెహ్వాల్!

హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ తన సత్తా ఏంటో నిరూపించుకుంటుంది. హాంకాంగ్ విజయంతో సీజన్‌కు ముగింపు పలకాలన్న లక్ష్యంతో ఈ టోర్నీ బరిలోకి దిగిన వరల్డ్ నెంబర్ టూ సైనా నెహ్వాల్, హాంకాంగ్ సూపర్ సిరీస్‌లో తన హవాను కొనసాగిస్తోంది. 

క్వార్టర్ ఫైనల్లో ప్రత్యర్థిని మట్టికరిపించిన సైనా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్‌ఫైనల్లో సైనా 21-11, 21- 10తో స్థానిక స్టార్ షట్లర్ పూ ఇన్ ఇప్‌పై నెగ్గి ఆసియాడ్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.

ఆద్యంతం మెరుగైన ఆటతీరును ప్రదర్శించిన సైనా నెహ్వాల్ కేవలం 27 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించింది. కాగా ఫైనల్ బెర్త్ కోసం సైనా జర్మనీ షట్లర్, ఆరోసీడ్ జులియన్ షెంక్‌తో సెమీఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది. ఒకవేళ జులియన్‌ను ఓడిస్తే టైటిల్‌పోరులో సైనా చైనాకు చెందిన టాప్‌సీడ్ గ్జిన్ వాంగ్ లేదా మూడోసీడ్ షిజియాన్ వాంగ్‌తో పోటీపడాల్సి ఉంటుంది.

గ్రహీత లేకుండా పురస్కారం: జియాబో ఫోటోకి నోబెల్‌

చైనాలోని ఓస్లా నగరంలో జరిగిన నోబెల్ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం చూపరులన ముక్కున వేలేసుకునేలా చేసింది. మానవ హక్కుల కోసం ఉద్యమాలను నడిపిన అసమ్మతి నాయకుడు లియు జియాబొకి ఈ ఏడాది అత్యంత ప్రతిష్ఠాకరమైన నోబెల్‌ శాంతి పురస్కారం లభించినప్పటికీ, ఆ పురస్కారాన్ని అందుకునేందుకు ఆయనను చైనీస్‌ ప్రభుత్వం విడుదల చేయలేదు.

దీంతో ఓ ఖాలీ కుర్చీలో జియాబొ ఫొటోని ఉంచి ఆ బహుమతి మొత్తం నగదును కుర్చీలో ఉంచారు. నూరు సంవత్సరాల నోబెల్‌ చరిత్రలో గ్రహీత లేదా వారి ప్రతినిధి అవార్డును స్వీకరించేందుకు రాలేకపోవడం ఇది రెండవసారి.

మొదటిసారి 1936లో జర్మన్‌ జర్నలిస్ట్‌, శాంతి ప్రచారకుడు కార్ల్‌ వన్‌ ఓసిడ్‌జ్కి నాజీ కాన్‌సన్‌ట్రేషన్‌ క్యాంపులో చిక్కుకుని ఉండడంవల్ల బహుమతి స్వీకరించేందుకు ఓస్లో రాలేక పోయారు. తాను నివశిస్తున్న దేశ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు నిర్బంధాన్ని చవిచూసిన ఒసిడిజ్కి లాగా చైనా నాయకత్వాన్ని నిరసించినందుకు లియు కూడా ప్రస్తుతం నిర్బంధంలో ఉన్నారు.

భారీ డీల్‌కు నో చెప్పిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్! (Sachin Tendulkar | Master Blaster | Rs20 crore | liqour brand)

FILE
కోట్ల విలువ చేసే భారీ డీల్‌కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నో చెప్పేశాడు. తన తండ్రి రమేశ్ టెండూల్కర్‌కు ఇచ్చిన మాట కోసం ఓ లిక్కర్ కంపెనీతో భారీ కాంట్రాక్టును వద్దన్నాడు. 

బ్రాండ్ ఏదన్నది కాకుండా.. డీఎల్ ఎంతనే విషయానికే ప్రాధాన్యమిచ్చే చాలామంది ఆటగాళ్ల మధ్య, అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 22 ఏళ్ల ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న మాస్టర్ నాన్నకు ఇచ్చిన మాట కోసం ఆ డీలే వద్దనేశాడు. రికార్డుస్థాయి మొత్తంతో తన కాళ్ల దగ్గరకొచ్చిన భారీ డీల్‌కు మాస్టర్ అంగీకరించలేదు. 

వివరాల్లోకెళితే.. తమ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా ఉండాలంటూ ఇప్పటిదాకా ఎవరికీ ఇవ్వనంత మొత్తంతో ఏడాదికి రూ. 20 కోట్ల కాంట్రాక్టును మాస్టర్‌కు ఆఫర్ చేసిందట ఓ లిక్కర్ కంపెనీ. 

కానీ యువతపై దుష్ప్రభావం చూపే మద్యం, ధూమపానం వంటి ఉత్పత్తులకు తానెప్పుడూ ప్రతినిధిగా ఉండబోనంటూ గతంలో తన తండ్రికిచ్చిన మాటకు కట్టుబడి సచిన్ ఆ డీల్‌ను తిరస్కరించాడు.

అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో రికార్డుల పంట పండిస్తున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సామాజిక న్యాయం కోసం లిక్కర్ కంపెనీతో డీల్‌కు ఒప్పుకోలేదని మాస్టర్ గ్రేట్ అని సన్నిహిత వర్గాలు, అభిమానులు 

Monday, December 6, 2010

Gollapalle-Pavan Kumar Yadav

అందరికి నమష్కరములు! ఇండియా అను ఈ బ్లాగ్స్పోట్ కి స్వగతం సుస్వాగతం!